సెప్టెంబరు 2 నుంచి చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి దేవస్థాన అధికారులతో పాటు, ప్రజాప్రతినిధులు, చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కండేయులు పాల్గొన్నారు. ఉత్సవాల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని.. వారికి తగిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై చర్చించారు. సెప్టెంబరు 2 నుంచి 22 వరకు ఉత్సవాలు జరగున్నాయని.. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కార్యనిర్వహణాధికారి తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు ఉదయం 6గంటల లోపు.. సాయంత్రం 6 గంటల తర్వాత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాలపై సమీక్ష - chittoor
కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించటానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని దేవస్థాన అధికారులు తెలిపారు.
కాణిపాకం