తిరుపతి దిగువ ఘాట్ వద్ద జూడాలు ఆందోళనకు దిగారు. కేంద్రం తీసుకువచ్చిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎమ్సీ) బిల్లుకు వ్యతిరేకంగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద జూడాలు భారీ ధర్నా చేపట్టారు. జూడాలు, వైద్య విద్యార్థులు తిరుమల రహదారిని దిగ్బంధం చేశారు. జూడాల ధర్నాతో కొండపైకి వెళ్లే వాహనాలు, బస్సులు నిలిచిపోవటంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి పైనుంచి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన జూడాలను పోలీసులు, భక్తులు పక్కకు లాగేశారు. ఈ ఘటనతో అలిపిరి రహదారిలో ఉద్రిక్తత నెలకొంది. తిరుమల దారిలో 3 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. ఘాట్ రోడ్లను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రేపట్నుంచి నిరాహార దీక్ష చేస్తామన్న జూడాలు, వైద్య విద్యార్థులు స్పష్టం చేశారు.
అలిపిరి వద్ద జూడాల ఆందోళన.. పలువురు అరెస్ట్
తిరుపతి దిగువ ఘాట్ వద్ద జూడాల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యులు చేస్తున్న ధర్నాతో...అలిపిరి వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనాలు నిలిచిపోవడం వలన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళనకారులను పోలీసులు వాహనాల్లో తరలించారు.
అలిపిరి వద్ద జూడాల ఆందోళన.. అదుపులోకి తెచ్చిన పోలీసులు