చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలోని ఓ సినిమా థియేటర్ వద్ద నిలిపి ఉన్న జేసీబీ వాహనాన్ని దొంగిలించి రూ.6 లక్షలకు అమ్మిన దొంగల ముఠాను కలికిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
జెసీబీని దొంగిలించి రూ. 6లక్షలకు అమ్మారు.. పోలీసులకు చిక్కారు! - kalikiri jcb robbers arrest news
చిత్తూరు జిల్లాలో జేసీబీని దొంగిలించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత నెల 26వ తేదీన ఈ చోరీ జరగ్గా.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.
కలికిరిలో జేసీబీ దొంగల అరెస్ట్
అనంతపురం జిల్లా బత్తలపల్లికి చెందిన హేమంత్ ప్రసాద్ కలికిరి ప్రాంతంలో జరుగుతున్న కాలువ తవ్వకాలు పనుల్లో తన జేసీబీని ఉపయోగిస్తున్నాడు. గత నెల 26వ తేదీన కలిగిరికి చెందిన జెసీబీ ఆపరేటర్లు రమణ, ఆనంద్, వెంకటేశ్వర్లు ఆ వాహనాన్ని తస్కరించి శాంతిపురం మండలానికి చెందిన ఆర్. ఎస్. మనీ, నాగరాజు, చంద్రశేఖర్, రామచంద్రలకు రూ.6 లక్షలకు అమ్మేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.