ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జనతా కర్ఫ్యూ: తిరుపతిలో మార్కెట్లన్నీ జనమయం

జనం కోసం.. మన కోసం... అందరం సంఘటితం అవుదాం. జనతా కర్ఫ్యూ పాటిద్దాం. కరోనా మహమ్మారిపై పోరాడుదాం. ఈ నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆదివారం ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని విభాగాలూ చర్యలు చేపట్టాయి. నిత్యావసరాలు, సరకులను కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలిరాగా తిరుపతిలోని మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.

By

Published : Mar 21, 2020, 8:23 PM IST

Published : Mar 21, 2020, 8:23 PM IST

' తిరుపతిలో మార్కెట్లన్నీ జనమయం'
' తిరుపతిలో మార్కెట్లన్నీ జనమయం'

జనతా కర్ఫ్యూ: తిరుపతిలో మార్కెట్లన్నీ జనమయం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు జనతా కర్ఫ్యూ. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని ప్రధాని ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా అప్రమత్తమయ్యారు.

'మార్కెట్లన్నీ జనమయం'

తిరుపతి నగరంలోని ప్రధాన మార్కెట్లు ప్రజలతో నిండిపోయాయి. సాధారణంగా తిరుపతిలో శనివారం మార్కెట్లలో విక్రయాలు అంతగా ఉండవు. ఆదివారం వచ్చే జనాలతో కిటకిటలాడుతుంటాయి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు సంఘీభావంగా ప్రజలంతా తమ గృహావసరాలకు కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు పెద్దఎత్తున మార్కెట్లకు వస్తున్నారు.

ఇవీ చదవండి

'కరోనాపై గ్రామస్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details