మరో 30 సంవత్సరాలు జగనే సీఎం: ఉప ముఖ్యమంత్రి - tuda
ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన అన్ని హామీలను వైకాపా ప్రభుత్వం అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. మరో 30 సంవత్సరాలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.
ప్రజలకిచ్చిన హామీల మేరకు అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం తూకివాకంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 151 స్థానాలు ఇచ్చి వైకాపాను ప్రజలు ఆశ్వీరదించారని గుర్తు చేశారు. మరో 30 ఏళ్ల పాటు జగనే సీఎంగా ఉండే రీతిలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని నారాయణ స్వామి అన్నారు. ఈ కార్యక్రమానికి తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త తదితరులు హాజరై మొక్కలను నాటారు. వనాల పెంపుదల, చెట్లను కాపాడుకోవడం వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.