ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు - radhi

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్​లో కిలోమీటరు మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.

తిరుమల

By

Published : Apr 16, 2019, 9:47 AM IST

Updated : Apr 16, 2019, 10:53 AM IST

తిరుమల ఏడు కొండల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కిలోమీటరు మేర క్యూలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు 5 గంటలు వేచి ఉంటున్నారు. నిన్న శ్రీవారిని 81 వేల 195 మంది భక్తులు దర్శించుకోగా.. 34 వేల 630 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం నాడు 3 కోట్ల 38 లక్షల రూపాయలుగా నమోదైంది.

తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటలు
Last Updated : Apr 16, 2019, 10:53 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details