చిత్తూరు జిల్లా తిరుమలలో కురిసిన భారీ వర్షానికి కనుమ దారుల్లో కొండ చరియలు విరిగి పడతున్నాయి. 2వ కనుమలో కొండపై నుంచి చెట్లు, రాళ్లు రహదారిపై పడ్డాయి. అధికారులు జేసీబీల సాయంతో వాటిని తొలగిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కొండల్లో కురిసిన వర్షానికి జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. మాల్వాడి గుండం వద్ద కొండపై నుంచి జాలువారుతున్న నీటి ధారలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
'తిరుమలలో భారీ వర్షం.. విరిగిపడతున్న కొండ చరియలు' - thirupathi
తిరుమలలో భారీ వర్షం కురిసింది. కనుమదారుల్లో అక్కడక్కడా కొండచరియలు విరిగిపడుతున్నాయి. రహదారులపై చెట్లు పడటం వల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
తిరుమలలో భారీ వర్షం