చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో గురువారం రాత్రి భారీగా వర్షం కురిసింది. ఫలితంగా ఆ ప్రాంతంలో వాగులు, వంకలు, కుంటలు, చెరువులు వాన నీటితో నిండిపోయాయి. శాంతిపురం మండలంలో 94, రామ కుప్ప 82, గుడుపల్లె 42, కుప్పం మండలంలో 26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వేరుశనగ, టమాటా ఇతర పంటలకు నీటి తడులు తప్పాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో భారీ వర్షం... నిండుతున్న కుంటలు, చెరువులు - చిత్తూరు జిల్లాలో భారీ వర్షం తాజా వార్తలు
చిత్తూరు జిల్లా అంతటా గురువారం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షాలకు కుప్పంలో కుంటల్లో నీరు భారీగా చేరింది. ఈ క్రమంలో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్షపు నీటితో నిండుతున్న కుంటలు, చెరువులు