సిరి ధాన్యాలే ఆరోగ్యానికి మూలం:ఆరోగ్య శాస్త్రవేత ఖాదర్ వలీ - ఆరోగ్య శాస్త్రవేత ఖాదర్ వలీ
తిరుపతిలో ఆదివారం జరిగిన 'ఆరోగ్యం-మహాభాగ్యం' అనే అంశంపై జరిగిన అవగహన సదస్సుకు ప్రముఖ ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ హాజరయ్యారు.
సిరి ధాన్యాలే ఆరోగ్యానికి మూలం:ఆరోగ్య శాస్త్రవేత ఖాదర్ వలీ
సిరి ధాన్యాలే సంపూర్ణ ఆరోగ్యానికి మూల ఆహారమని ప్రముఖ ఆరోగ్య శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ పేర్కొన్నారు. తిరుపతి రాష్ట్రీయ సంస్కృతం విద్యాపీఠం ఆవరణలోని ఆడిటోరియంలో ఆదివారం అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, రైతు నేస్తం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో 'ఆరోగ్యం- మహా భాగ్యం' అనే అంశంపై పై అవగాహన సదస్సు జరిగింది. సమావేశానికి నగర ప్రజలు విశేష సంఖ్యలో హాజరై ఖాదర్ వలీ ప్రసంగాన్ని వీక్షించారు.