చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో నాటుసారా కేంద్రాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. మండలంలోని పెద్ద తాండ పరిసర గ్రామాల్లో 93 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. 2150 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి, 120 కేజీల బెల్లం, 60 కేజీల తుమ్మ చెక్క స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో చిత్తూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పీటీ.శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
2150 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. ఆరుగురు అరెస్టు - చిత్తూరు జిల్లా
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఆరుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
పుంగనూరు మండలంలో పెరుగుతున్న నాటుసారా తయారీదారులు..