రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్... తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానంతరం కుటుంబ సమేతంగా తిరుచానూరు చేరుకున్న ఆయనకు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో బసంత్ కుమార్, తితిదే అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు గవర్నర్కు తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయమని తితిదే అధికారులు తెలిపారని... అందుకే పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నానని గవర్నర్ తెలిపారు.
తిరుచానూరు అమ్మవారి సేవలో నూతన గవర్నర్ - ammavarau
రాష్ట్ర గవర్నర్గా ఇటీవలే నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్... తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పండితులు, ఈవో, అధికారులు ఘన స్వాగతం పలికారు.
గవర్నర్