అన్నదాతలను ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో9గంటల పగటి విద్యుత్ పంపిణీకి విద్యుత్ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.ఏపీఎస్‌పీడీసీఎల్ పరిధిలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు సహా...నెల్లూరు,ప్రకాశం,గుంటూరు,కృష్ణా జిల్లాల్లో....తొలి విడతగా కొన్ని పంపు సెట్లకు తొమ్మిది గంటల విద్యుత్ పంపిణీ ప్రారంభించింది.
సంస్థ పరిధిలో సుమారు11లక్షల30వేల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.వీటిలో గృహావసరాలు,పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లు కలిసి ఉన్నందున... 9గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఈ క్రమంలో...వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ పంపిణీ చేసే ఫీడర్ల నుంచి...గృహావసరాల ఫీడర్ల విభజనతో నిరంతరాయ విద్యుత్ పంపిణీకి వీలు కలుగుతుందని గుర్తించారు.