చిత్తూరు నడివీధి గంగమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయం ప్రకారం వంశపారంపర్య ధర్మకర్త తెదేపా నేత సీకే బాబు తొలిపూజలు చేశారు. భక్తులకు పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. పొంగళ్లు పెట్టి, అంబలి పోసారు. వేపాకులు కట్టుకుని వేషధారణలతో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నగరంలో పోలీసులు భద్రతా చర్యలు తీసుకున్నారు.
చిత్తూరులో వైభవంగా గంగమ్మ జాతర ప్రారంభం - pasupu
చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత సీకే బాబు తొలిపూజలు నిర్వహించారు.
గంగమ్మ జాతర