ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గజ వాహనంపై విహరించిన తిరుమలేశుడు - gaja vahana seva for lord venkatesha

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం రాత్రి మలయప్ప స్వామి గజరాజుపై మాడవీధుల్లో విహరించారు. గజరాజుపై ఊరేగుతూ భాగవతంలోని గజేంద్రమోక్షం వృత్తాంతాన్ని స్మరింపజేస్తారు.

గజ వాహనంపై విహరించిన తిరుమలేశుడు

By

Published : Oct 6, 2019, 12:01 AM IST

Updated : Oct 7, 2019, 12:49 PM IST

గజ వాహనంపై విహరించిన తిరుమలేశుడు

తిరుమలలో శ్రీవారి వాహన సేవలు నయనానందకరంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు రాత్రి స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో గజరాజులు, అశ్వ, వృషభ దళాలు ముందు నడవగా... వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు తిరువీధుల్లో సందడిగా మారాయి. గజవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతున్న మలయప్పస్వామివారిని దర్శించుకున్న భక్తులు పారవశ్యంతో పొంగిపోయారు. గోవిందనామ స్మరణతో స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. గజవాహనంపై ఉన్న దేవదేవుడిని వీక్షిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Last Updated : Oct 7, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details