2 నిమిషాలు ఆలస్యం... గ్రూప్-2 పరీక్షకు నలుగురు దూరం - పరీక్ష
ఆలస్యంగా వచ్చారని నలుగురు అభ్యర్థులను గ్రూప్-2 పరీక్షకు అనుమతించని ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.
పరీక్ష కేంద్రం వద్ద వేచి ఉన్న అభ్యర్థులు
By
Published : May 5, 2019, 2:20 PM IST
కొంప ముంచిన ఆలస్యం
తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు నలుగురు అభ్యర్థులను అనుమతించలేదు. ఏపీపీఎస్సీ ఆదేశాల మేరకు ఉదయం 9.45 గంటలకు సరిగ్గా పరీక్ష కేంద్రాల గేట్లg మూసివేశారు. సరిగ్గా అదే సమయానికి చిత్తూరు జిల్లా మదనపల్లె, అనంతపురం జిల్లా తాడిపత్రి, తదితర ప్రాంతాలకు చెందిన నలుగురు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారు ఎంత వేడుకున్నా ఆలస్యమైందన్న కారణంతో పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు అక్కడి సిబ్బంది.