ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ప్రభుత్వ భూములను గుర్తించండి... పేదలకు పంచేద్దాం" - lands distribution

వచ్చే ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇంటి పట్టాలు ఇవ్వడమే లక్ష్యమని మంత్రులు స్పష్టంచేశారు. ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను విడిపించి పేదలకు అందజేయాల్సిన బాధ్యత రెవిన్యూ అధికారులపైనే ఉందన్నారు. సాగులో లేని చెరువు భూములపై జిల్లా న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి, అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

సమీక్ష

By

Published : Sep 25, 2019, 8:12 PM IST

మంత్రుల సమీక్ష

సమస్యలన్నింటినీ అధిగమిస్తూ భూసేకరణను వేగవంతం చేయటం ద్వారా వచ్చే ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇంటి పట్టాలివ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ విషయమై.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, నారాయణస్వామితో పాటు మంత్రులు రంగనాథ రాజు, పెద్ది రామంచంద్రారెడ్డి.. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. వాటిని అమలు చేసే దిశగా రెవిన్యూ అధికారులకు సలహాలు, సూచనలు అందచేశారు. భూ ఆక్రమణ దారుల చేతుల్లో నుంచి ప్రభుత్వ భూములను విడిపించి పేదలకు అందచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సాగులో లేని చెరువు భూములను, జిల్లా న్యాయమూర్తులతో సంప్రదింపుల ద్వారా వివాదాస్పదంగా ఉన్న ప్రభుత్వ భూములను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. గిరిజన ప్రాంతాలు లేని గ్రామాలను పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించేలా వారి విధివిధానాల్లోనూ మార్పులు తీసుకువస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details