ఏళ్ల తరబడి తాము పండించిన చెరకు పంటతో వ్యాపారం చేసుకుంటున్న చక్కెర కర్మాగారం బకాయిలు మాత్రం చెల్లించడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. చిత్తూరు జిల్లా నిండ్రలో స్థానిక నేతమ్స్ చక్కెర కర్మాగారం ఎదుట సమీప గ్రామాల చెరకు రైతులు ధర్నాకు దిగారు. 36 కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలను అడ్డుకునేందుకు నిండ్ర పోలీసులు విఫలయత్నం చేశారు. యాజమాన్యం స్పందించే వరకూ కదిలేది లేదంటూ పరిశ్రమ ఎదుట రైతులు బైఠాయించారు. రెండేళ్లుగా బిల్లులు రాక, తీవ్ర వేదన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డెక్కిన చక్కెర రైతులు... బకాయిలు చెల్లింపులెప్పుడు?
చక్కెర కర్మాగారం బకాయిలు చెల్లించడం లేదంటూ చిత్తూరు జిల్లా నిండ్ర రైతులు రోడ్డెక్కారు. తమ చెరకు పంటతో వ్యాపారం చేసుకుంటూ చెల్లింపులు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 36 కోట్ల బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రోడ్డెక్కిన రైతులు... బకాయిలు చెల్లింపులెప్పుడు?