చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో స్పందన కార్యక్రమంలో ఎస్సీ రైతులు నిరసన చేపట్టారు. జిల్లా పాలనాధికారితోపాటు మంత్రి నారాయణ స్వామిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఏళ్ల తరబడిగా సాగు చేస్తున్న భూముల నుంచి తమను వెళ్లగొట్టాలని చూడడం సరికాదన్నారు. తాము సాగుచేసుకుంటున్న భూమిపై వేరేవారికి హక్కు కల్పిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు స్పందిచకుంటే... అమరావతికి వెళ్లి పోరాటం చేస్తామని తెలిపారు.
సాగు భూములకు పట్టాలివ్వాలని ఆందోళన - farmers
సాగు భూములకు పట్టాలివ్వాలని ఎస్సీ రైతులు ఆందోళనకు దిగారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం స్పందన కార్యక్రమంలో నిరసన చేపట్టారు.
స్పందనలో ఎస్సీ రైతుల నిరసన