చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ పరిధిలోని కురబలకోట మండల కార్యాలయంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. బాలకృష్ణ అనే రైతుకు తనకు చెందిన భూమి వివరాలను అధికారులు ఆన్లైన్లో తొలగించారని ఆరోపించాడు. సమస్య పరిష్కరించాలని ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందని వాపోయాడు. భూమికి సంబంధించిన ఆధారాలన్నీ చూపించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వీఆర్వో తనపై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ.. ఆ కార్యాలయంలోనే పడుకొని నిరసన తెలిపాడు.
'వీఆర్వో గారూ.. ఆధారాలున్నాయి.. నా భూమి అప్పగించండి'
తన భూమిని ఆన్లైన్లో అధికారులు తొలగించారని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆధారాలు చూపించినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. స్థానిక వీఆర్వో తనపై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కార్యాలయంలోనే పడుకొని నిరసన తెలిపాడు. చిత్తూరు జిల్లా కురబలకోట మండల కార్యాలయంలో జరిగిన ఘటన వివరాలివి..!
భూమిని ఇప్పించాలని రైతు నిరసన
Last Updated : Nov 6, 2019, 9:32 PM IST