చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుండ్లూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు ఆలయ భూముల పరాధీనంలో ఉన్నట్లు స్థానికులు చేసిన ఫిర్యాదుల మేరకు...దేవాదాయ శాఖ అధికారులు స్పందించారు. మదనపల్లి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్తో పాటు తిరుపతి కి చెందిన దేవాదాయశాఖ భూపరిరక్షణ విభాగం సర్వేయరు మార్కెండేయ ఆలయ భూములను గుర్తించారు. మూడు శతాబ్దాల కిందట చోళ రాజులు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఆలయ ధూపదీప నైవేద్యాలకు గాను 100 ఎకరాల మేరకు భూములు కేటాయించారు. కలికిరి మండలంతో పాటు కలకడ, గుర్రంకొండ, కె.విపల్లి మండలాల్లో కూడా ఈ ఆలయానికి మాన్యం భూములు ఉన్నాయి. భూములన్నీ 30 ఏళ్లుగా పరాధీనంలో ఉండటంతో వేలం పాటలు నిర్వహించలేదు. దీంతో ఆలయానికి ఆదాయం లేకుండా పోయింది. మాన్యం భూములు ఆక్రమించుకున్న వారే సాగు చేసుకుంటున్నారు. మరికొందరు మన్యం భూములను కౌలుకు ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని గ్రామస్థులు, భక్తులు దేవాదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. అధికారులు రంగంలోకి దిగి అన్యాక్రాంతమైన భూముల సరిహద్దులను గుర్తిస్తున్నారు. వారం రోజుల్లో నాలుగు మండలాల్లోని భూములను గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని తెలిపారు.
దేవాలయ భూముల అన్యాక్రాంతంపై అధికారుల స్పందన - endoment officers
చిత్తూరు జిల్లా గుండ్లూరులోని చెన్నకేశవస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతంపై దేవాదాయశాఖ అధికారులు స్పందించారు. అన్యాక్రాంతమైన భూముల సరిహద్దులను గుర్తిస్తున్నారు.
అధికారుల సర్వే