రెండు ఏనుగుల తగాదాలో చివరికి ఏమైంది? - chitoor
రెండు ఏనుగులు ఒకదానిపై మరొకటి దాడి చేసుకోవడంతో అందులో ఓ ఏనుగు తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండల పరిధిలోని ఊసర పెంట అటవీ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది.
![రెండు ఏనుగుల తగాదాలో చివరికి ఏమైంది?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3256076-1034-3256076-1557623063451.jpg)
చిత్తూరు జిల్లా పలమనేరులోని ఊసరపెంటలో ఏనుగు మృతిచెందింది. 2ఏనుగులు దాడి చేసుకోవడంతో అందులో ఓ ఏనుగు తీవ్ర గాయాలపాలై మృతి చెందింది. పలమనేరు మండలంలోని ఊసరపెంటలో గజరాజు మృతి చెందినట్లు స్థానికులు తమకు సమాచారం అందించారని... ఎఫ్ఆర్వో మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. చనిపోయింది ఆడ ఏనుగుగా గుర్తించామన్నారు. ఏనుగు మృతి చెంది వారం రోజులు అవుతుందని... అటవీ ప్రాంతం కావడంతో ఎవరికీ తెలియలేదని వెల్లడించారు. రెండు ఏనుగుల మధ్య దాడి జరగడంతోనే ఒకటి మృతి చెందిందని పోస్టుమార్టంలో తేలిందన్నారు.