Elephants Attack: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచల అటవీ సమీప ప్రాంతాలలోని పంటపొలాలపై తరచుగా ఏనుగులు దాడులు చేస్తున్నాయి. పొలాలను ధ్వసం చేస్తూ.. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కళ్యాణి డ్యాం రాగిమానుకుంట, నాగపట్ల చెరువు సమీపంలోని అరటి, మామిడి, కొబ్బరి తోటలపై 7 ఏనుగులు దాడి చేశాయి. పంట పొలాలకు వేసిన కంచెలను, పైపులను నాశనం చేశాయి. గత కొంతకాలంగా జాడ లేని ఏనుగుల గుంపు ఒక్కసారిగా అటవీ సమీపంలోని పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి.
Elephants Attack పండ్ల తోటలపై ఏనుగుల దాడి, ఏక్కడంటే
Elephants Attack తిరుపతి జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగులు విరుచుకుపడ్డాయి. సమీప గ్రామాల్లోని పండ్ల తోటలపై దాడి చేశాయి. గత కొంతకాలంగా కన్పించని ఏనుగులు మళ్లీ పంట పొలాలపై దాడులు చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పండ్ల తోటలపై ఏనుగుల దాడి, ఏక్కడంటే
సమాచారం అందుకున్న స్థానిక అటవీశాఖ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి ఏనుగుల గుంపును కళ్యాణి డ్యాం అటవీ ప్రాంతంలోకి మళ్లించారు. మళ్లీ అడవుల్లో నుంచి పంట పొలాల పై దాడులు చేయకుండా.. గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. అడవి నుంచి ఏనుగులు బయట వచ్చే ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశామని.. మంటలు వేసి, డప్పులు, బాణసంచ కాలుస్తూ శబ్దం చేయటం వంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి:
Last Updated : Aug 21, 2022, 11:04 PM IST