చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో గజరాజులు బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలోని రంగంపేట పంచాయతీ రాగి మానుగుంట ప్రాంతంలో రెండు రోజులుగా ఏనుగులు పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. బోరు పైపులు ,ఫెన్సింగ్లను ధ్వంసం చేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వీటి దాడులతో రైతులకు కంటి మీద కునుకు కరవై, అనుక్షణం భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తిరుపతి డిఎఫ్ఓ కు సమాచారం అందించామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందేలా చూడాలని, అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీచదవండి.ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ భూములు తిరిగి సేకరణ