చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని అంగన్వాడీ భవనం దెబ్బతింది. ప్రహరీ కూలిపోయింది. వర్షపు నీళ్లు లోనికి ప్రవేశించగా.. సరుకులు తడిసి నిరుపయోగంగా మారాయి. రికార్డులు, కాగితాలు పూర్తిగా నీట మునిగాయి. వాటిని సిబ్బంది బయటకు తీసి ఆరబెట్టారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 20 వేల రుపాయలు ఆస్తి నష్టం జరిగిందని చెప్పారు.
వర్షంతో కూలిన అంగన్వాడీ ప్రహరీ.. రూ.20 వేల ఆస్తి నష్టం - chitoor
చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షం కారణంగా పుత్తూరు అంగన్వాడి కేంద్ర భవనం ప్రహరీ కూలిపోయింది. లోపలికి వర్షపు నీరు చేరగా... సుమారు 20 వేల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు సిబ్బంది తెలిపారు.
వర్షంతో కూలిన గోడ..తడిసిన సరుకులు