తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మంగళవారం దర్చించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, మద్ది గిరిధర్, అంబటి రాంబాబు, సంగీత దర్శకుడు మణిశర్మ, దర్శకుడు కోదండరామి రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
Thirumala : 'మా' ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పలేం.... :దర్శకుడు కోదండరామి రెడ్డి - AP government on Cinema tickets selling
తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు మంగళవారం దర్చించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, మద్ది గిరిధర్, అంబటి రాంబాబు, సంగీత దర్శకుడు మణిశర్మ, దర్శకుడు కోదండరామి రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ మా ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నాయని... గెలవడానికి ఇరు వర్గాలు గట్టిగా ప్రయత్నిస్తున్నారన్నారు. కాబట్టి ఎవరు గెలుస్తారో చెప్పలేమని తెలిపారు. సినిమా టిక్కెట్లు విక్రయానికి సంబంధించి సినీ పెద్దలు మాట్లాడినవి ప్రభుత్వం అంగీకరించినట్లుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అందికీ ఆమోదయోగ్యమైన...మంచి చేసే నిర్ణయం తీసుకుంటారమే తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : TTD:తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం