ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"సమష్ఠి కృషితోనే మద్యపాన నిషేధం సాధ్యం" - నారాయణస్వామి

ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నారాయణ స్వామి సొంత నియోజకవర్గం జీడీనెల్లూరులో సుడిగాలి పర్యటన చేశారు. తొలుత సొంతూరు పాదిరి కుప్పంలో పర్యటించిన ఆయనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

ఎక్సైజ్ శాఖామంత్రి నారాయణ స్వామి

By

Published : Jun 19, 2019, 9:07 PM IST

Updated : Jun 20, 2019, 12:00 AM IST

సమష్ఠి కృషితోనే మద్యపాన నిషేధం సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత గ్రామంలోని గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్వేటి నగరం, వెదురుకుప్పం గ్రామాల్లో పలు కార్యక్రమాలకు హాజరైన ఉప ముఖ్యమంత్రి... అంగన్​వాడీ, ఆశా కార్యకర్తలతో మాట్లాడారు. మద్యపాన నిషేధాన్ని తన నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తానని తెలిపారు. దీనికి సహకరించాలని వారిని కోరారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపరటం ద్వారా పల్లెలను ప్రగతిబాట పట్టిస్తామన్నారు.

ఎక్సైజ్ శాఖామంత్రి నారాయణ స్వామి
Last Updated : Jun 20, 2019, 12:00 AM IST

ABOUT THE AUTHOR

...view details