గవర్నర్ ఆమోదించినా మూడు రాజధానుల బిల్లుపై తెదేపా అధినేత చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. అయితే.. రాయలసీమ జిల్లాలోని కుప్పంలో చంద్రబాబు నాయుడు, ఉత్తరాంధ్రలో ఒక తెదేపా ఎమ్మెల్యే, కోస్తాలో ఇంకో ఎమ్మెల్యే రాజీనామా చేసి గెలిస్తే... మూడు రాజధానుల ప్రస్తావనను తాము విరమించుకుంటామని నారాయణ స్వామి సవాల్ విసిరారు. లేకుంటే మూడు రాజధానులకు మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
'చంద్రబాబు రాజీనామా చేసి గెలిస్తే.. ఆ నిర్ణయం విరమించుకుంటాం'
గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదం తెలిపినా.. తెదేపా నేతలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. మూడు రాజధానులతో అభివృద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు.
deputy cm narayanaswamy demands chandrababu resign