చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలంలో జరిగిన కథ. కమ్మలపల్లి గ్రామానికి చెందిన మహేంద్ర నాయుడు, లక్ష్మీదేవిల కొడుకు రిత్విక్. ఎస్.ఎన్.పేటకు చెందిన వెంకటరాజు, సరస్వతి కుమార్తె అఖీల. వీరిద్దరు 2016-17 సంవత్సరంలో కలిసి చదువుకున్నారు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమను పెద్దల ముందుకు తీసుకువచ్చారు. కులాలు వేరుకావటం వల్ల వీరి ప్రేమను అంగీకరించక.... పెద్దలు అడ్డుపడ్డారు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయిన రిత్విక్, అఖిల ఈ నెల 10న కడపలో పెళ్లిచేసుకుని చంద్రగిరికి చేరుకున్నారు. అఖిల తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉండటంతో తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను వేడుకున్నారు.
పెద్దలొద్దన్నా... ప్రేమే ముఖ్యమని ఒకటయ్యారు
వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారి విషయాన్ని పెద్దల ముందు పెట్టారు. ప్రేమకు కులం రంగు పూసి ఇరువురి తల్లిందండ్రులు అడ్డుపడ్డేందుకు ప్రయత్నించారు. దీంతో ఎలాగైనా ఒక్కటవ్వాలని సంకల్పబలంతో నిర్ణయించుకున్న ఆ జంట... ఇంటి నుంచి పారిపోయారు. కడపలో పెళ్లి చేసుకుని చంద్రగిరికి వచ్చారు. తమ పెద్దల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు.
కడపలో వివాహం చేసుకున్న ప్రేమజంట