తన సొంత నియోజకవర్గానికి నేడు చంద్రబాబు రాక - wife
దిల్లీ పర్యటనలో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేడు తన సొంత నియోజకవర్గానికి రానున్నారు. సతీసమేతంగా జాతరకు హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పానికి రానున్నారు. కుప్పంలో జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి బెంగళూరు నుంచి ఉదయం తొమ్మిదిన్నరకు హెలికాప్టర్‌లో శాంతపురం మండలం గణేషపురం చేరుకుంటారు. అక్కడ నుంచి 10 గంటలకు పీఈఎస్ వైద్యకళాశాలకు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. పదిన్నరకు సతీమణి భువనేశ్వరితో కలిసి.. గంగమాంబ జాతరకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. 11 గంటల 30 నిమిషాలకు తిరిగి విజయవాడకు పయనమవుతారు