చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు నగరి నియోజవర్గం లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో.. పోలీస్ బృందాలు తీసుకోవలసిన జాగ్రత్తల పట్ల పలు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి - ఎన్నికల తాజా వార్తలు
చిత్తూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ డిపార్ట్మెంట్ అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎటువంటి హింసాత్మక సంఘటనలూ చోటుచేసుకోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పోలీసు బృందాలకు సూచనలు చేశారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ రిశాంత్ రెడ్డి
జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లందరూ సహకరిస్తూ.. ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రతి ఓటర్ కూడా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:పోలింగ్ కోసం పటిష్ట చర్యలు చేపట్టాం: తిరుపతి ఎస్పీ