తంబళ్లపల్లె ఉన్నత పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, మోడల్ పాఠశాల, సిద్దా రెడ్డి గారి పల్లి అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ భరత్ గుప్తా పరిశీలించారు. పాఠశాలల్లో సమస్యల గుర్తించి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికిఅక్కడికక్కడే చర్యలు చేపట్టారు. తనిఖీ చేసిన ప్రతి పాఠశాలలోనూ కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థుల ప్రగతిని పరిశీలిచారు. వారికి పాఠాలు చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - చిత్తూరు జిల్లా
చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాలల పనితీరు పారిశుద్థ్యం, విద్యార్థుల చదువు గురించి అడిగి తెలుసుకున్నారు.
chittoor
మోడల్ పాఠశాల బాలికలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తనిఖీలో గుర్తించిన సమస్యలన్నిటినీ సంబంధిత శాఖల అధికారులకు తెలిపి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం, విధుల్లో నిర్లక్ష్యం పట్ల కలెక్టర్ అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి లిబియాలో పడవ బోల్తా... 150 మంది గల్లంతు