అమెరికా న్యూజెర్సీలో చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మటిలవారిపల్లెకు చెందిన ద్వారకనాథరెడ్డి( 37) ఆత్మహత్య చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ద్వారకనాథరెడ్డి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ద్వారకానాథ్‌రెడ్డి కుటుంబం 12 ఏళ్లుగా న్యూజెర్సీలో ఉంటోంది. కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
అమెరికాలో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్య - latest crime news in chittoor
అమెరికాలో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అమెరికాలో నిద్రమాత్రలు మింగి చిత్తూరు వాసి మృతి