'గురుకుల పాఠశాలలో గురువుగా మారిన జిల్లా కలెక్టర్' - gangadhara nellore
ఆసక్తితోనే అభ్యసన సాధ్యం. సాధించాలన్న ఆసక్తికి సరైన అభ్యసన తోడైతే విద్యార్థులకు విజయం దానంతట అదే తోడవుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అన్నారు. పాలనాధికారి రాత్రి నిద్ర కార్యక్రమంలో భాగంగా గంగాధర నెల్లూరులోని బాలికల గురుకుల పాఠశాలలో బస చేశారు.
'గురుకుల పాఠశాలలో గురువుగా మారిన జిల్లా కలెక్టర్'
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. పాలనాధికారి రాత్రి నిద్ర కార్యక్రమంలో భాగంగా ఆయన అక్కడే బస చేశారు. పాఠశాల బాలికలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. తరగతి గదిలో ఉపాధ్యాయుడిగా అవతారమెత్తి ... విద్యార్థినుల కాసేపు బోధించారు. అనంతరం ... వసతి గృహం లోనే రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు.