ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Chittoor: మేర్లపాక సమీపంలో బస్సు బోల్తా..తప్పిన పెను ప్రమాదం - చిత్తురూ జిల్లా సమాచారం

నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్​ ట్రావెల్స్ బస్ చిత్తూరు జిల్లా మేర్లపాక సమీపంలో బోల్తా పడింది. అయితే ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

Chittoor: మేర్లపాక సమీపంలో బస్సు బోల్తా
Chittoor: మేర్లపాక సమీపంలో బస్సు బోల్తా

By

Published : Aug 10, 2021, 10:48 PM IST

బస్సు బోల్తాపడటంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక సమీపంలోని పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిపై మంగళవారం వేకువజామున జరిగింది.

నెల్లూరు నుంచి బెంగళూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రవేట్ ట్రావెల్స్​కు చెందిన ఓల్వో బస్సు మేర్లపాక వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా.. మిగిలిన వారు సురక్షితంగా బయట పడ్డారు. వెంటనే మరో బస్సు రావడంతో ప్రయాణికులంతా బెంగళూరుకి వెళ్లారు. ఏర్పేడు సీఐ శ్రీహరి సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:three persons died: టిప్పర్‌కు తగిలిన విద్యుత్‌ తీగలు... ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details