తిరుపతి గ్రామీణం కొత్తూరులో ప్రచారంలో పాల్గొని తిరిగి వస్తున్న సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలపై చెవిరెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారు. వైకాపా తరపున ప్రచారం చేయాలని లేకపోతే ప్రాణాలు తీస్తామంటూ సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను విచక్షణరహితంగా కొట్టారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.
రామచంద్రాపురంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న గుర్రప్ప అనే మీడియా ప్రతినిధిపైనా దాడికి దిగారు. ఈ 2 సంఘటనల్లో మొత్తం ఆరుగురికి గాయాలయ్యాయి. బాధితులను తిరుపతి రుయా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రెచ్చిపోయిన చెవిరెడ్డి అనుచరులు- ప్రత్యర్థులపై దాడులు - ycp
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. తిరుపతి గ్రామీణం కొత్తూరులో ఐదుగురు తెదేపా కార్యకర్తలపై దాడి చేశారు. మీడియా ప్రతినిధినీ కొట్టారు.
తేదేపా కార్యకర్తలపై చెవిరెడ్డి అనుచరులు దాడి చేశారు.
ఇవీ చూడండి.