చంద్రప్రభ వాహనంపై స్వామివారు - chandragiri_venkateshwara_swamy_brahmostsavalu
చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు నడుమ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
చిత్తూరు జిల్లా చంద్రగిరి శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన శనివారం సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు నడుమ స్వామివారిని భక్తులు కీర్తించారు.మాడ వీధుల్లో భక్తులకు స్వామి దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలంకరణతో సుందరంగా అలంకరించారు.
TAGGED:
శ్రీనివాస మంగాపురం