Kuppam Town: కుప్పం ఆర్టీసీ డిపో నుంచి వెళ్లే బస్సు సర్వీసులు తగ్గించడం, పలు ప్రాంతాలకు సర్వీసులు రద్దు చెయ్యడంపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో నాలుగేళ్ల క్రితం 105 బస్సు సర్వీసులు ఉంటే, ప్రస్తుతం 54 సర్వీసులకు కుదించడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సర్వీసులను పునరుద్ధరించాలంటూ చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. కుప్పం నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ప్రజలు నిత్యం వ్యాపార, ఇతర పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారని అన్నారు. కుప్పం నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు వెళ్లే సర్వీసులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చంద్రబాబు వాపోయారు. కుప్పం నుంచి తిరుమలకు కూడా సర్వీసులను తగ్గించారని, కుప్పం నుంచి చిత్తూరుకు సర్వీసును తొలగించారని ఆక్షేపించారు.
కుప్పంలో బస్సుల తగ్గింపుపై ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ.. - Chittoor District News
Kuppam Town: కుప్పం ఆర్టీసీ డిపో నుంచి వెళ్లే బస్సు సర్వీసులు తగ్గించడం, పలు ప్రాంతాలకు సర్వీసులు రద్దు చెయ్యడంపై ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శనివారం లేఖ రాశారు.
కుప్పం ఆర్టీసీ డిపో