ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"తెదేపా కార్యకర్తలపై దాడులను సహించేది లేదు" - assaults

తెదేపా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొనేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

చంద్రబాబు

By

Published : Jul 2, 2019, 5:53 PM IST

చంద్రబాబు బహిరంగ సభ

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. నియోజకవర్గంలోని శాంతిపురంలో కార్యకర్తలతో సమావేశమై... అనంతరం స్థానిక కూడలిలో బహిరంగ సభలో ప్రసంగించారు. తనకు30 ఏళ్లుగా ఓట్లేసి గెలిపిస్తోన్న ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. తెదేపా ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. హంద్రీనీవా జలాలను జిల్లాకు తీసుకొచ్చామని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగాయని చెప్పారు. ఇప్పటికే ఆరుగురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పార్టీవారైనా ప్రజలు మెచ్చే పాలన అందించాలని... హింసాత్మక చర్యలను ఎవరూ హర్షించరని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రశాంతమైన వాతావరణం కోసం అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంల ో శాంతిభద్రతలు నెలకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details