కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్టు నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించిన తర్వాత.. చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. జనసేనతో పొత్తుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘పొత్తులు పెట్టుకున్నప్పుడే తెదేపా గెలిచిందని వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినప్పుడు గెలిచాం, ఓడిపోయాం కూడా. రాష్ట్ర ప్రయోజనాల మేరకు పరిస్థితులకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ శతజయంతి సంబరాలు ఘనంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు శ్రీధర్ వర్మ, గౌనివారి శ్రీనివాసులు, గాజుల ఖాదర్‌బాషా పాల్గొన్నారు.
CBN Video: రాష్ట్ర ప్రయోజనాల మేరకే పొత్తులపై నిర్ణయం - చంద్రబాబు లవ్ కామెంట్స్
CBN Crazy Answer Over TDP-JSP Alliance: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తొలిరోజు పర్యటనలో భాగంగా గురువారం..పెద్దతండాలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కార్యకర్త.. వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తారా ? అని ప్రశ్నించారు. కార్యకర్త ప్రశ్నకు చంద్రబాబు తన హాస్యచతురత జోడించి క్రేజీ ఆన్సర్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్నవారంతా పగలబడి నవ్వారు. ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే...
chandrababu
Last Updated : Jan 8, 2022, 4:17 AM IST