చిత్తూరు జిల్లా కుప్పం శాసనసభ నియోజకవర్గానికి తెదేపా అధినేత నారా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలైంది. భారీ ఊరేగింపు నిర్వహించిన కుప్పం తెదేపా నేతలు...చంద్రబాబు తరపున 2 సెట్లనామపత్రాలుదాఖలు చేశారు. ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, తెదేపా నాయకులు సుబ్బరామిరెడ్డి, పీఎస్ మునిరత్నం, భవానీ, మైనార్టీ నేత ఒబేదుల్లా చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అందచేసిన ప్రమాణపత్రంలో...చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆస్తుల వివరాలను తెలిపారు.
చంద్రబాబు ఆస్తులు....
మొత్తం ఆస్తులు : రూ.20 కోట్ల 44లక్షల 33వేల 814
చరాస్తులు : రూ.47లక్షల 38 వేల 67
స్థిరాస్తి మొత్తం : రూ.19 కోట్ల 96లక్షల 95 వేల 474
అప్పులు : రూ.5 కోట్ల 24లక్షల 96వేల 605 (లోకేశ్ కోసం 8లక్షల 89వేల 088 రుణం)
* 2017-18లో ఐటీకిచూపించిన ఆదాయం: 64లక్షల 73వేల 208 రూపాయలు
వాహనం : అంబాసిడర్ కారు(ఏపీ09జీ 0393). దీని విలువ రూ.2లక్షల 22వేల 500 రూపాయలు
స్థిరాస్తి వివరాలు :
* హైదరాబాద్ జూబ్లీహిల్స్రోడ్ నెంబరు 65లో 1225 చదరపు గజాల స్థలంలో 14,950 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ భవనం. ఈ స్థలాన్ని 1985లో రూ.లక్షా 76వేల రూపాయలతో కొనుగోలు చేశారు. ఆ తర్వాత 7 కోట్ల 99లక్షల 59వేల 988 రూపాయలు ఈ భవనంపై పెట్టుబడి పెట్టారు.
ప్రస్తుతం ఈ భవనం విలువ 19 కోట్ల 55లక్షల వేయి 474రూపాయలు అని అఫిడవిట్లోతెలిపారు.
* చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో శేషాపురం గ్రామంలోని సర్వే నెంబరు 214/3 లో 0.97ఎకరాల్లో 3,950 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం. ఇందుకోసం 23లక్షల 84 వేల 462 రూపాయలు ఖర్చు చేశారు. ప్రస్తుతవిలువ రూ.41 లక్షల 94వేల రూపాయలు.
* సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తుల విలువ :19 కోట్ల 55లక్షల వేయి 474 రూపాయలు
* వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 41లక్షల94వేల రూపాయలు.
అప్పుల వివరాలు:
* బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోకేశ్ తో కలిసి(50 శాతం) 5 కోట్ల16లక్షల 07వేల 517 రూపాయలు అప్పుగా తీసుకున్నారు.
* నారా లోకేశ్ కు రూ.8లక్షల 89వేల 088 రూపాయల రుణం ఇప్పించారు.