తిరుపతి ఐఐటీ భవన నిర్మాణాల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఐఐటీ ఏర్పాటుకు కావాల్సిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 వరకు దశల వారీగా అప్పగించిందని కేంద్రం పార్లమెంటుకు తెలియజేసింది. తిరుపతి ఐఐటీ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంఖ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
వేగంగా తిరుపతి ఐఐటీ నిర్మాణ పనులు: కేంద్రం - తిరుపతి ఐఐటీ నిర్మాణ పనులు తాజా వార్తలు
తిరుపతి ఐఐటీ భవన నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్‌కు తెలిపింది. రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంఖ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
central government on Tirupati IIt
దేశ వ్యాప్తంగా ఐదు ఐఐటీలు ఏర్పాటు చేయాలని 2014-15 ఏడాదిలో నిర్ణయం జరిగిందని.. అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, జమ్మూకశ్మీర్, ఛత్తీస్‌ఘడ్, గోవా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ రాజ్యసభకు నివేదించింది. గోవా మినహా మిగిలిన అన్ని ఐఐటీల నిర్మాణంతో పాటు.. విద్యా సంబంధిత అన్ని రకాల కార్యకలాపాలు తాత్కాలిక క్యాంపస్‌లలో కొనసాగుతున్నాయని తెలిపింది.
ఇదీ చదవండి: హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం: కేంద్రం