car accident: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కన్నలి ఎస్టీ కాలనీలో ఎర్ర చందనంతో వెళ్తున్న కారు బీభత్సం సృష్టించింది. రహదారి పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లో నిద్రిస్తున్న భాస్కర్, రత్నమాల దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Car Accident: చిత్తూరు జిల్లాలో కారు బీభత్సం.. పలువురికి గాయాలు - car accident in thottambedu
car accident: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలో కారు బీభత్సం సృష్టించింది. రహదారి పక్కన ఇంట్లోకి కారు దూసుకెళ్లింది.
car accident
Last Updated : Feb 2, 2022, 11:28 AM IST