ఈ నెల 13న తిరుపతిలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 13 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలను కొవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించాలని తితిదే నిర్ణయం తీసుకుంది. రేపు సాయంత్రం ఆలయంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది.
13 నుంచి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు - tirupathi sri kodandaramaswami brahmotsavalu
తిరుపతిలో శ్రీ కోందడరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీన ప్రారంభం కానున్నాయి. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. నేడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
నెల 13 నుంచి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నేడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయాన్ని శుద్ధి చేసి... శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.