తమిళనాడు భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని భాజాపా నేత భానుప్రకాష్ రెడ్డి పోలీసులను కోరారు. తమిళనాడుకు చెందిన భక్తులు, ఎస్పీఎఫ్ పోలీసుల మధ్య గురువారం అలిపిరి వద్ద వివాదం జరిగింది. భక్తులపై భద్రతా సిబ్బంది దాడి చేసిన వీడియోలు బయటకు రావడంతో వారిని బదిలీ చేశారు. నిషేధిత వస్తువులతో వచ్చి భక్తులే గొడవకు కారణమయ్యారని పోలీసులు భక్తులపై కేసుపెట్టారని చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన భాజాపా నేతలు ఠాణాకు వచ్చి భక్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
తమిళనాడు భక్తులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
తమిళనాడు భక్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని భాజాపా నేత భానుప్రకాష్ రెడ్డి తిరుమల పోలీసులను కోరారు.
భాజాపా నేత భానుప్రకాష్ రెడ్డి