''జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన అవసరం''
విద్యార్థులంతా జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకురావటం ద్వారా తాగునీటి సమస్యను అరికట్టవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరి షా అభిప్రాయపడ్డారు.
awareness_on_water_resources_at_sv_university
కాంటూర్ బండింగ్, ఇంకుడు గుంతల తవ్వకం తదితర కార్యక్రమాల ద్వారా ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టుకోవచ్చని తిరుపతి నగరపాలలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరి షా చెప్పారు. నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో జలశక్తి అభియాన్ - విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో రెండెకరాల్లో మియావాకీ తరహా అడవుల పెంపకంపైనా సమాలోచనలు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలపై విద్యార్థులు తమవంతుగా ప్రచారాలను నిర్వహించాలని కోరారు.