చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపల్లి గ్రామంలో అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు తమపై దాడికి పాల్పడ్డారని షికారీ(ఎస్టీ)లు ఆరోపించారు. కొంతమంది గాయాలతో శనివారం చికిత్స కోసం తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.
'ప్రభుత్వమిచ్చిన భూముల కోసం ఎస్టీలపై దాడి' - చింతలపల్లిలో ఎస్టీలపై దాడులు
ప్రభుత్వం తమకు కల్పించిన భూముల కోసం అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఎస్టీలు ఆరోపించారు. దాడిలో సుమారు 20 మందికిపైగా గాయపడ్డారని చెప్పారు.
Attack on STs for government-given lands in chittor district
ప్రభుత్వం తమకు కల్పించిన భూములను ఆక్రమించేందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఇందులో భాగంగా అతి దారుణంగా తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. వారి దాడిలో సుమారు 20 మందికిపైగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.