నకిలీ నగలు తనఖా పెట్టిన వ్యక్తి అరెస్ట్ - నకిలీ నగలు తనఖా పెట్టిన వ్యక్తి అరెస్ట్
చిత్తూరు సహకార టౌన్ బ్యాంకులో నకిలీ నగలను తనఖా పెట్టి రూ.80 లక్షలు రుణం తీసుకున్న కేసులో ఆ బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి చెందిన స్థిర, చర ఆస్తుల్ని సీజ్ చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
చిత్తూరు సహకార టౌన్ బ్యాంకులో నకిలీ నగలను తనఖా పెట్టి రూ.80 లక్షలు రుణం తీసుకున్న కేసులో ఆ బ్యాంకు మాజీ చైర్మన్ షణ్ముగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. టౌన్ బ్యాంకు తాజా మాజీ ఛైర్మన్ షణ్ముగం 2016లో 5 కిలోల నకిలీ బంగారు ఆభరణాలు టౌన్‌లోని దర్గా శాఖలో తనఖా పెట్టి రూ.80 లక్షల రుణం పొందినట్లు ఆ శాఖ మేనేజర్ పీఆర్ సుబ్రమణ్యం ఈ నెల 13 వ తేదీన చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన బంధువులు, అనుచరులు 14 మందితో టౌన్ బ్యాంకులో ఖాతాలు తెరిపించి 5 కిలోల నకిలీ బంగారు ఆభరణాలను 43 దఫాలుగా కుదవ పెట్టి షణ్ముగం రుణాలు పొందినట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో బ్యాంకు అప్రయిజర్ ధరణీ సాగర్‌కు కొంత నగదు ఇచ్చినట్లు వివరించారు.
ఇదీ చూడండి:ఇంటర్ ప్రాక్టికల్స్‌లో కాపీయింగ్
TAGGED:
bank