రాష్ట్ర ప్రభుత్వ సాయం... నిరుద్యోగ యువతకు వరం - skills
కళాశాలల్లో నేర్చుకున్న సబ్జెక్టుకు ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. దీనివల్ల అనేక మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను దూరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలను రూపొందించింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా రాష్ట్రంలోని యువతను నైపుణ్యం దిశగా అడుగులు వేయిస్తోంది.
శిక్షణ తీసుకుంటున్న యువత
అలసిన యువతకు ఆసరా
ప్రతీ సంవత్సరం వేల సంఖ్యలో ఇంజినీరింగ్ పట్టభద్రులు తయారవుతున్నా బయటి మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేకపోవటమే నిరుద్యోగానికి కారణంగా భావించి ఈ కోర్సులను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు లేక ఆయా కంపెనీలు అడిగే అర్హతలు సాధించలేక ఇన్నాళ్లూ డీలాపడిన ఇంజినీరింగ్ యువత ఈ వృత్తి నైపుణ్య కోర్సుల ద్వారా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : May 7, 2019, 9:01 AM IST