ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏపీఎస్పీడీసీఎల్​ పదోన్నతులలో ప్రజా ప్రతినిధుల జోక్యం తగదు' - చిత్తూరు తాజా వార్తలు

ఏపీఎస్పీడీసీఎల్​లో వాచ్​మెన్లుగా పనిచేస్తున్న వారికి ఆపరేటర్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్​ చేస్తూ తిరుపతి ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో.. యునైటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయమణి పాల్గొన్నారు. న్యాయంగా రావాల్సిన ఆపరేటర్ ఉద్యోగాలలో ప్రజాప్రతినిధుల జోక్యం తగదని ఆమె హెచ్చరించారు.

apspdcl watchmens protest
తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ఎదుట ధర్నా

By

Published : Jan 5, 2021, 4:52 PM IST

ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో వాచ్​మెన్లుగా పనిచేస్తున్న వారికి ఆపరేటర్లుగా పదోన్నతి కల్పించాలని యునైటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయమణి డిమాండ్ చేశారు. సీఎండీ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రజాప్రతినిధుల జోక్యం సరికాదంటూ.. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న వాచ్​మెన్​లకు న్యాయంగా రావాల్సిన ఆపరేటర్ ఉద్యోగాలలో.. ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకోవడం సమంజసమని కాదని ఆమె ప్రశ్నించారు. దీనిపై అధికారులు స్పందించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details