తిరుపతి లోక్సభ కాంగ్రెస్కు కంచుకోట అని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 12 సార్లు కాంగ్రెస్ జెండా ఎగరేసిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో భాజపా వెంకటేశ్వర స్వామినే మోసం చేసిందన్నారు. భాజపా మోసగారితనం, వైకాపా, తెదేపా.. చేతగానితనం వల్లే ప్రత్యేక హోదా రాలేదని ధ్వజమెత్తారు. రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ, దుగ్గరాజపట్నం మేజర్ ఓడరేవు రాలేదనీ.. మన్నవరం ఫ్యాక్టరీ మూతబడిందని వివరించారు. భాజపా, వైకాపా, తెదేపాలకు తిరుపతి లోక్సభ ఓటర్లను ఓటు అడిగే నైతిక హక్కు లేదని తులసిరెడ్డి పేర్కొన్నారు.
తిరుపతి కాంగ్రెస్కు కంచుకోట: తులసిరెడ్డి - తిరుపతి ఉప ఎన్నికలు వార్తలు
భాజపా, వైకాపా, తెదేపాలపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికలో ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు వారికి లేదని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
తులసి రెడ్డి